MDMA Drugs: పోలీసులను చూసి డ్రగ్స్ ప్యాకెట్స్ మింగిన యువకుడు

Update: 2025-03-08 14:58 GMT

డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికిన యువకుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు 

Man Swallows MDMA Drug Packets: డ్రగ్స్ చెకింగ్ చేస్తున్న పోలీసులను చూసిన ఓ యువకుడు వారి నుండి తప్పించుకునేందుకు తన దగ్గర ఉన్న రెండు ఎక్‌స్టసీ డ్రగ్స్ ప్యాకెట్స్ మింగారు. కేరళలోని కొయికోడ్ జిల్లా అంబయతోర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

అంబయతోర్‌ ప్రాంతంలో యువత డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని పట్టుకునేందుకు తనిఖీలు చేపట్టారు.

వారిని చూసిన ఇయ్యదన్ షనిద్ అనే యువకుడు తన వద్ద రెండు మిథైలెనెడియోక్సి మెథాంఫేటమిన్ (MDMA / Ecstatcy) అనే డ్రగ్స్ ప్యాకెట్స్ ఉండటంతో కంగారుపడ్డారు. పోలీసుల తనిఖీల నుండి ఎలా తప్పించుకోవాలా అనే భయంతో ఆ రెండు ప్యాకెట్స్ ను మింగేశారు. తమను చూసి తప్పించుకుపోతున్న షనిద్‌ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.

పోలీసుల ఎదుట షనిద్ అసలు విషయం అంగీకరించడంతో వెంటనే ఆ యువకుడికి చికిత్స అందించేందుకు కొయికోడ్ మెడికల్ కాలేజీకు తీసుకెళ్లారు. ఆ యువకుడిని పరిశీలించిన డాక్టర్లు సర్జరీ చేసి ఆ ప్యాకెట్స్ బయటికి తీసేందుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే యువకుడు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అందించేలోపే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నిషద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అంబయతోర్‌లో యువత డ్రగ్స్ అలవాటు బారినపడుతున్నారని వస్తోన్న ఆరోపణలకు ఈ ఘటన బలం చేకూర్చినట్లయిందని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.    

Delimitation Explainer: డీలిమిటేషన్‌ అంటే ఏంటి? ఎలా చేస్తారు? నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికి ఎక్కువ లాభం? ఎవరికి ఎక్కువ నష్టం? 

Full View

New Income Tax Bill: ఐటి అధికారుల చేతుల్లో మీ ఈమెయిల్స్, బ్యాంక్ ఎకౌంట్స్, సోషల్ మీడియా 

Full View

Actress Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఏంటి ఈ హీరోయిన్ వెనకున్న పొలిటీషియన్ ఎవరు?

Full View

Tags:    

Similar News