Liquor Bottle: మద్యం సీసా తిరిగిస్తే రూ.20 వాపస్.. కేరళ ప్రభుత్వం నూతన నిర్ణయం

ఉదయం నుంచే వైన్‌షాప్‌లు, బార్ల వద్ద మందుబాబుల క్యూ చూశారా..? ఎంత ధరైనా పెడితే నిమిషం ఆలస్యం లేకుండా తీసుకెళ్లేస్తుంటారు. కానీ, మద్యం తాగిన తర్వాత ఖాళీ సీసాలు ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు.

Update: 2025-07-31 16:44 GMT

Liquor Bottle: మద్యం సీసా తిరిగిస్తే రూ.20 వాపస్.. కేరళ ప్రభుత్వం నూతన నిర్ణయం

ఉదయం నుంచే వైన్‌షాప్‌లు, బార్ల వద్ద మందుబాబుల క్యూ చూశారా..? ఎంత ధరైనా పెడితే నిమిషం ఆలస్యం లేకుండా తీసుకెళ్లేస్తుంటారు. కానీ, మద్యం తాగిన తర్వాత ఖాళీ సీసాలు ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు. వీటి వల్ల ప్లాస్టిక్‌ మలినాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.

ఇకపై రాష్ట్రంలో అమ్మే ప్రతి మద్యం సీసాపై రూ.20 అదనంగా డిపాజిట్‌గా వసూలు చేయనున్నారు. మద్యం సేవించి, ఖాళీ బాటిల్‌ను తిరిగి అదే అవుట్‌లెట్‌కు తీసుకెళ్లినప్పుడు ఆ డిపాజిట్‌ను వెనక్కి ఇస్తారు. దీంతో ప్రజల మద్యం వినియోగ తీరులో మార్పు వస్తుందని, ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గుతాయని ప్రభుత్వం నమ్ముతోంది.

ప్రస్తుతం కేరళ బేవరేజెస్ కార్పొరేషన్‌ ద్వారా ఏడాదికి దాదాపు 70 కోట్ల మద్యం సీసాలు విక్రయమవుతున్నాయి. వీటిలో కేవలం 56 కోట్ల బాటిళ్లు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. మిగిలినవి పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి.

ఈ విషయంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి ఎం.బి. రాజేశ్‌ స్పందిస్తూ, గాజు సీసాల వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. రూ.800కి పైగా ధర ఉన్న మద్యం గాజు సీసాలోనే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.800కంటే తక్కువ ధర ఉన్న మద్యం మాత్రం ప్లాస్టిక్‌ సీసాల్లో సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చారు.

ఈ పాలసీని సెప్టెంబర్‌లో కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, జనవరి 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే తరహాలో తమిళనాడు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

Tags:    

Similar News