కరోనాను జయించిన వృద్ధ దంపతులు.. వీరికి చికిత్స అందించిన ఓ నర్సు మాత్రం..

Update: 2020-03-31 09:57 GMT

అతడు కరోనాను జయించాడు. అవును నిజంగా కరోనా మహమ్మరి పై గెలిచాడు. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులున్నప్పటికీ కేరళ వాసి కరోనా నుంచి కోలుకున్నాడు.

కరోనా ఎక్కువగా వృద్దులపై ప్రతాపం చూపుతుంది. అప్పటికే రెండు, మూడు వ్యాధులు ఉంటే ప్రాణాలకే ముప్పు ఉంటుంది. కానీ కేరళలో కరోనా మహమ్మారి బారినపడిన వృద్ధ దంపతులు కోలుకున్నారు. వీరిలో భర్త వయసు 93 ఏళ్లు కాగా, భార్య వయసు 88 సంవత్సరాలు. వారిద్దరూ వైరస్‌ను జయించినట్టు కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ చెప్పారు. వారిద్దరికీ బీపీ, షుగర్‌తో వృద్ధాప్య సమస్యలు ఉన్నప్పటికీ వైరస్ నుంచి వారు బయటపడ్డారన్నారు.

పథనంతిట్ట జిల్లాలోని రాన్ని ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతుల కుమారుడు భార్యాపిల్లలతో కలిసి ఇటీవల ఇటలీ నుంచి తిరిగొచ్చాడు.అప్పటికే వారికి వైరస్ ఉండడంతో అది వారి కుటుంబంలోని మొత్తం ఏడుగురికి సోకింది. వెంటనే కొట్టాయంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. వృద్ధ దంపతులు సహా కుటుంబంలోని మిగతా వారందరూ కోలుకున్నారని, వారికి నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు వచ్చాయని డాక్టర్లు ప్రకటించారు. త్వరలోనే వీరిని ఇంటికి పంపిస్తామన్నారు. వీరికి చికిత్స అందించిన ఓ నర్సు మాత్రం కరోనా బారినపడ్డారు. 


Tags:    

Similar News