Kerala Bus Viral Video Suicide Case: కేరళ వైరల్ బస్ వీడియో సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్, ముస్తఫా పరారీ
Kerala Bus Viral Video Suicide Case: కేరళ వైరల్ బస్ వీడియో సూసైడ్ కేసులో కీలక మలుపు. దీపక్ ఆత్మహత్యకు కారణమైన షింజితా ముస్తఫా దేశం విడిచి పరారైనట్లు పోలీసుల అనుమానం.
Kerala Bus Viral Video Suicide Case: కేరళ వైరల్ బస్ వీడియో సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్, ముస్తఫా పరారీ
Kerala Bus Viral Video Suicide Case: కేరళ వైరల్ బస్ వీడియో సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న షింజితా ముస్తఫా దేశం విడిచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కోజికోడ్‌కు చెందిన దీపక్ అనే వ్యక్తిపై బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ షింజితా ముస్తఫా సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీడియో వైరల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీపక్ తల్లి కన్యక ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆత్మహత్యకు పురిగొల్పినట్లు షింజితా ముస్తఫాపై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆమె మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు.
ఇదిలా ఉండగా, షింజితా ముస్తఫా ఇప్పటికే దేశం విడిచి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే ప్రక్రియలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు, వీడియోలో పేర్కొన్న విధంగా ఎలాంటి అనుచిత ఘటన జరగలేదని ప్రాథమికంగా స్పష్టం చేశారు.
ఈ ఘటన కేరళతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా, సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.