Kedarnath: భక్తులకు అలర్ట్.. కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేత

Kedarnath: ఉత్తరఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు.

Update: 2025-10-23 05:46 GMT

Kedarnath: భక్తులకు అలర్ట్.. కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేత 

Kedarnath: ఉత్తరఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు. శీతాకాలం నేపథ్యంలో భాయ్‌దూజ్ పండుగ రోజున శాస్త్రోక్తంగా ఆలయ తలుపులను మూసివేయడం ఆనవాయితీ వస్తున్నది. ద్వారాల మూసివేత కార్యక్రమానికి ముందు ఆలయాన్ని వివిధ రకాల పూలతో అత్యంత సుందరంగా, వైభవంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి సైతం ఆలయానికి చేరుకుని ప్రత్యేకంగా స్వామివారిని దర్శించుకున్నారు.

వేకువ జామున 4 గంటలకు ఆలయ తలుపులు మూసివేసే ప్రక్రియను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు, ఆచారాలు ముగిసిన అనంతరం ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేశారు. ద్వారబంధనం పూర్తి కాగానే.. బాబా కేదారేశ్వరుడి పంచముఖి డోలి యాత్ర ప్రారంభమై ఉఖీమఠ్‌కు బయలుదేరింది. ఈ ఆరు నెలల శీతాకాలపు విరామ సమయంలో బాబా కేదారేశ్వరుడు ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో పూజలు అందుకోనున్నాడు. కేదార్‌నాథ్‌లో అత్యంత చలి, మంచు కారణంగా ఆలయాన్ని మూసివేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

Tags:    

Similar News