Russian Woman: ముందస్తు సమాచారం లేకుండా ఆ రష్యా మహిళను బహిష్కరించొద్దు..కర్ణాటక హైకోర్టు వెల్లడి

Russian woman: గోకర్ణ సమీపంలోని గుహల్లో బయటపడ్డ రష్యా మహిళను ముందస్తు సమాచారం లేకుండా బహిష్కర చేయొద్దని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది.

Update: 2025-07-24 06:27 GMT

Russian Woman: ముందస్తు సమాచారం లేకుండా ఆ రష్యా మహిళను బహిష్కరించొద్దు..కర్ణాటక హైకోర్టు వెల్లడి

Russian Woman: గోకర్ణ సమీపంలోని గుహల్లో బయటపడ్డ రష్యా మహిళను ముందస్తు సమాచారం లేకుండా బహిష్కర చేయొద్దని కర్ణాటక హైకోర్టు వెల్లడించింది. బహిష్కరణకు సంబందించిన పెట్టిన కేంద్ర ప్రభుత్వ పిటీషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. వివరాల్లోకి వెళితే..

గత నెలలో గోకర్ణ సమీపంలోని అడవులో ఎవరో తిరుగుతున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు అడవి ప్రాంతాన్ని క్షుణంగా పరిశీలించారు. అయితే ఒక చోట గుహ ముందు బట్టలు ఆరవేసి ఉన్నది చూసి గుహలోపలికి వెళ్లి చూస్తే ఒక రష్యా మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి అక్కడ కొంతకాలంగా జీవిస్తుందని తెలిసింది. ఈ విషయం విన్న పోలీసులు మొదట నివ్వెర పోయినా ఆ తర్వాత ఆమెను అక్కడ నుంచి తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కర్ణాటక హైకోర్టు బహిష్కరణను తాత్కాలికంగా నిలిపివేస్తునట్టు వెల్లడించింది.

రష్యా మహిళ పేరు నైనా కుటినా. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురిని పోలీసులు రక్షించి సురక్షిత ప్రాంతంలో ఉంచారు. అయితే ఆమె బహిష్కరణ ఉత్తర్యులను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటీషన్‌పై తాజాగా కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆమె బహిష్కరణను న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది.

కేసు విచారణ జరుగుతున్న సమయంలో రష్యా మహిళ దగ్గర తన పిల్లలకు సంబంధించి కూడా ఎటువంటి ధ్రువ పత్రాలు లేవని కోర్టుకు విన్నవించుకున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన బాలల హక్కులను పరిగణలోకి తీసుకుని బహిష్కరణను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు తెలిపింది. అంతేకాదు ఈకేసులో ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోర్టు చెప్పింది.

అదేవిధంగా కోర్టు, పిల్లలకు సబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో దానికి గురించి లిఖితపూర్వక అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించాలని కూడా సూచించింది. అందుకే, ముందస్తు సమాచారం లేకుండా ఆమెను ఎలాంటి బహిష్కరణ చేయొద్దని మరోసారి స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణ ఆగష్టు 18కి కోర్టు వాయిదా వేసింది. ఆ రోజు అఫిడవిట్లు వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టు ఒక నిర్ణయానికి రానుంది.

Tags:    

Similar News