క్యాన్సర్‌తో మాజీ అండర్ వరల్డ్ డాన్ మృతి

కొంతకాలంగా క్యాన్సర్ తో పోయాడుతోన్న మాజీ అండర్ వరల్డ్ డాన్ ముత్తపా రాయ్‌ (68) మృతిచెందాడు.

Update: 2020-05-15 06:26 GMT
don Muthappa Rai(file photo)

కొంతకాలంగా క్యాన్సర్ తో పోయాడుతోన్న మాజీ అండర్ వరల్డ్ డాన్ ముత్తపా రాయ్‌ (68) మృతిచెందాడు.ఈ ఘటన కర్ణాటక రాష్టంలో చోటుచేసుకుంది. ముత్తపా రాయ్‌ శుక్రవారం మరణించారు. అతను కొంతకాలంగా మెదడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.. దాంతో కొంతకాలంగా మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.. చికిత్స సమయంలో అతను మరణించాడు.

అతనికి ఈ ఏడాది జనవరిలో మెదడు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దక్షిణా కన్నడ జిల్లాకు చెందిన ముత్తప్ప రాయ్‌ను గురువారం రాత్రి బెంగుళూరు ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. బెంగళూరులో బ్యాంక్ ఉద్యోగిగా తన వృత్తిని ప్రారంభించిన ముత్తప్ప రాయ్.. ఆ తరువాత డాన్స్ క్లబ్ , రెస్టారెంట్‌ లను ప్రారంభించాడు.

పాస్‌పోర్ట్ కేసుకు సంబంధించి అతన్ని మే 2002 లో దుబాయ్ నుంచి భారత్‌కు పంపించారు. ముతప్పను రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (ఆర్ అండ్ ఎడబ్ల్యు), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) , కర్ణాటక పోలీసులు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయా అనే విషయంపై ఆరా తీశారు. అతను గతంలో లాభాపేక్షలేని సంస్థ 'జయ కర్ణాటక' ను స్థాపించాడు.

Tags:    

Similar News