కర్నాటక బలపరీక్షపై హైటెన్షన్ ..కుమార సర్కార్ కూలేనా..నిలిచేనా..?

Update: 2019-07-22 07:41 GMT

కర్ణాటకలో బలపరీక్షకు ముహూర్తం ఖరారైంది. గత రెండువారాలుగా కన్నడ నాట ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి ఈ రోజు తెరపడనుంది. సాయంత్రం 6 గంటల్లోపు బల పరీక్ష నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఇన్ని రోజులు జరిగిన సంక్షోభానికి ఈ రోజు తెరదించుతామని తెలిపారు.

మధ్యాహ్నం 3 గంటలకు బలపరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విధానసభకు చేరుకున్న సీఎం కుమారస్వామి, స్పీకర్ రమేష్ కుమార్‌తో భేటీ అయ్యారు. బలపరీక్షకు మరో రోజు గడువు కోరారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు సహకరించాలని.. వారికి కుమారస్వామి లేఖ కూడా రాశారు.

మరోవైపు బల పరీక్ష ఇవాళే జరిగేలా చూడాలంటూ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్‌.శంకర్, నాగేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీం నిరాకరించింది. మంగళవారం లేదా ఆపైన ఎప్పుడైనా దీనిపై విచారిస్తామని, ఈ రోజు సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

రాజీనామా చేసిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సమన్లు జారీ చేశారు. రేపటిలోగా వచ్చి వారి రాజీనామాలకు కారణాన్ని వివరించాలని ఆదేశించారు. కారణం సరైందని తేలకపోతే చట్టప్రకారం వారిపై అనర్హత వేటు వేస్తామని తెలిపారు. మంగళవారం అందరూ వచ్చి తనకు కనిపించాలని ఆదేశించారు. 

Tags:    

Similar News