Karnataka: కర్ణాటక కేబినెట్‌ విస్తరణ.. సిద్దరామయ్య టీమ్‌లోకి మరో 24మంది ఎమ్మెల్యేలు

Karnataka: కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ గెహ్లాట్‌

Update: 2023-05-27 11:49 GMT

Karnataka: కర్ణాటక కేబినెట్‌ విస్తరణ.. సిద్దరామయ్య టీమ్‌లోకి మరో 24మంది ఎమ్మెల్యేలు

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 24 మంది ఎమ్మెల్యేలకు తన మంత్రివర్గంలో చోటుకల్పించారు. కర్ణాటక రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.

కొత్తగా కర్ణాటక మంత్రివర్గంలో చేరిన వారిలో హెచ్‌కే పాటిల్‌, కృష్ణ బైరెగౌడ, దినేశ్‌ గుండూరావు, క్యాథసంద్ర ఎన్‌. రాజన్న, దర్శనపూర్‌ శరనబసప్ప, శివానంద్‌ పాటిల్‌, మధు బంగారప్ప ఉన్నారు. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి శాఖలు కేటాయించలేదు. అందరీకి ఒకేసారి శాఖలు కేటాయించే అవకాశం ఉంది. 

Tags:    

Similar News