Kanpur Encounter: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే అనుచరుడు దొరికాడు

Kanpur encounter : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని బికారు గ్రామంలో 8 మంది పోలీసులను హత్య చేసి.. 3 రోజులుగా పరారీలో ఉన్నాడు గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే.

Update: 2020-07-05 09:11 GMT

Kanpur encounter: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని బికారు గ్రామంలో 8 మంది పోలీసులను హత్య చేసి.. 3 రోజులుగా పరారీలో ఉన్నాడు గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే. అతడ్ని పట్టుకునేందుకు 25 స్పెషల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.. తాజాగా అతని సహచరుడు దయశంకర్ అగ్నిహోత్రిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. దాడి సమయంలో అతను వికాస్‌తోనే ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అతనిపై 50 వేల రివార్డు కూడా ఉంది. వికాస్ కాల్పులకు పాల్పడిన తుపాకీ తన పేరు తోనే ఉందని అతను పోలీసులకు చెప్పాడు. పోలీసుల దాడులకు ముందే వికాస్‌కు కాల్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. దాంతో ప్రణాళిక ప్రకారం 25-30 మందిని దాడికి సిద్ధం చేశామని.. వారు ఆయుధాలతో ఇంటికి వాచినట్టు తెలిపాడు.

కాగా కల్యాణ్‌పూర్ ప్రాంతంలో పోలీసులు ఎన్‌కౌంటర్ సందర్భంగా దయాశంకర్ పట్టుబడ్డాడు. అతని కాలికి బులెట్ గాయాలు ఉన్నట్టు గుర్తించారు. మొదటుగా ముట్టడి తరువాత లొంగిపోవాలని పోలీసులు కోరినప్పటికీ, అతను స్థానికుడి ద్వారా పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో అతని సమాచారం ఇస్తే ఇచ్చే బహుమతిని 50 వేల రూపాయల నుండి లక్ష రూపాయలకు పెంచారు.

కాగా కాన్పూర్ జిల్లాలోని చౌపేపూర్ ప్రాంతానికి చెందిన రాహుల్ తివారీ బావ.. లల్లన్ శుక్లా భూమిని వికాస్ బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. దీంతో వికాస్‌పై రాహుల్‌ కేసు పెట్టారు. జూలై 1 న వికాస్ తన సహచరుల సహాయంతో రాహుల్‌ను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టాడు. చంపేస్తానని బెదిరించాడు. దీనిపై రాహుల్ పోలీస్ స్టేషన్లో మరోసారి ఫిర్యాదు చేశాడు. దాంతో వికాస్ దూబెను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లిన క్రమంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకోగా.. ఈ ఘటనలో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి చెందారు.

Tags:    

Similar News