Kangana Ranaut: కంగనా చెంపపై కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్
Kangana Ranaut: కంగనా రనౌత్‌కి చంఢీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది.
Kangana Ranaut: కంగనా చెంపపై కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్
Kangana Ranaut: కంగనా రనౌత్‌కి చంఢీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో చెకింగ్ విభాగంలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ కంగనా చెంపపై కొట్టారు. రైతుల ఉద్యమ సమయంలో వారిని అగౌరవపరిచారని... తన అమ్మ సైతం ఆందోళన చేసిందని సదరు కానిస్టేబుల్ తెలిపారు. CISF కానిస్టేబుల్ దాడి ఘటనపై కంగనా స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా విజయం సాధించారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశం కోసం చంఢీగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఢిల్లీ చేరుకున్న అనంతరం కంగన సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారుల్ని కలిసి ఈ ఘటన గురించి వివరించారు. దీంతో దీనిపై దర్యాప్తు చేసేందుకు బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. కుల్విందర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి తరలించారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన అనంతరం ఆమెపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో CISF అధికారులు ఫిర్యాదు చేశారు.