ఆర్చరీలో కాంచనపల్లి విద్యార్థుల దూకుడు .. సంజనశ్రీకి 15 బంగారు పతకాలు

ఆర్చరీలో దూసుకుపోతున్న కాంచనపల్లి విద్యార్థులు 15 గోల్డ్‌ మెడల్స్ సాధించిన సంజనశ్రీ స్పోర్ట్స్ స్కూల్ కోచ్‌ శిక్షణతో ఆరితేరుతున్న విద్యార్థులు

Update: 2025-11-17 07:25 GMT

ఆర్చరీలో కాంచనపల్లి విద్యార్థుల దూకుడు—సంజనశ్రీకి 15 బంగారు పతకాలు

పిట్ట కొంచెం కూత గణంలా ఆ అమ్మాయి ఆర్చర్ లో అద్భుతాలు సృష్టిస్తుంది. చిన్న వయసులోనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 గోల్డ్ మెడల్స్ సాధించింది. తన అద్భుతమైన ప్రదర్శనతో చూపర్లను ఆకర్షిస్తుంది. నాలుగో తరగతిలో ఆర్చరీలో ప్రవేశించిన సంజన శ్రీ ప్రతి పోటీలో గోల్డ్ మెడల్ సాధిస్తూ వస్తుంది. ఈనెల 16న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన నేషనల్ ఆర్చరీ పోటీలో పాల్గొంది.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాంచనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సంజన శ్రీ ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తుంది. జూలూరుపాడు మండలం అంజనాపురానికి చెందిన సంజన శ్రీ ఆర్చరీ లో శిక్షణ పొందుతుంది. శిక్షణ తీసుకున్న అనతి కాలంలోనే ఖమ్మంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రథమ స్థానంతో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత ఐదో తరగతిలో కాంచనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్లో సీటు సంపాదించిన సంజన శ్రీ రాష్ట్రంలో ఎక్కడ ఆర్చరీ పోటీలు జరిగినా పాల్గొంటూ 15 గోల్డ్ మెడల్స్ సాధించింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ పోటీలో కాంచనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ, తృతీయ స్థానం సంపాదించారు.


కోచ్ మారెప్ప పర్యవేక్షణలో కాంచనపల్లి గురుకులంలో సంజన శ్రీతో పాటు మిగతా విద్యార్థులు ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కోచ్ మారెప్ప ఇండియన్ రౌండ్ 30 మీటర్లు, 20 మీటర్లు పోటీల్లో అద్భుతంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ స్కూల్ నుండి బరిలో దిగిన విద్యార్థులు కచ్చితంగా పతకాలు సాధిస్తున్నారు. ఐటిడిఎ పీఓ రాహుల్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్ రావు సహకారంతో క్రీడల్లో రాణిస్తున్నామంటున్నారు విద్యార్థులు.


సంజన శ్రీ తో పాటు జ్యోత్స్న కూడా ఆర్చరీ లో రాణిస్తోంది కాంచన పల్లి గురుకులంలో పదవ తరగతి వరకు ఉండటంతో అక్కడితో శిక్షణ ఆగిపోతుంది. ఆ తర్వాత సెక్షన్ లేకపోవడంతో వాళ్ల కెరీర్ అంతటితో ఆగిపోతుంది. గురుకులానికి ఇంటర్మీడియట్ కూడా శాంక్షన్ అయితే మరో రెండు సంవత్సరాలు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. నేషనల్ స్థాయే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆర్చరీలో రాణిస్తామంటున్నారు.

Tags:    

Similar News