'చంద్రయాన్‌ 2' ఆర్బిటర్‌ బాగా పనిచేస్తోంది : ఇస్రో ఛైర్మన్‌ శివన్‌

Update: 2019-09-26 09:55 GMT

చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌ అద్భుతంగా పని చేస్తోందని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ చెప్పారు. అర్బిటర్ నుంచి గ్రౌండ్ స్టేషన్ కు సంకేతాలు వస్తున్నాయని అన్నారు. కీలకమైన ల్యాండర్ తో సంకేతాల పునరుద్ధరణపై ఎలాంటి తాజా సమాచారం లేదని చెప్పారు. చంద్రయాన్ 2 ఆర్బిటర్ తమ అంచనాలకు మించి రాణిస్తోందని అన్నారు. అత్యధిక రిజల్యూషన్ తో గల ఫొటోలు, ఇతర డేటా సమాచారాన్ని గ్రౌండ్ స్టేషన్ కు చేరవేస్తోందని చెప్పారు. లాండర్‌ విషయంలో పొరపాటు ఏం జరిగిందనే విషయాన్ని విశ్లేషించడానికి జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఆ కమిటీ నివేదిక సమర్సించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ చేపట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికైతే తమ తదుపరి ప్రణాళికపై పని చేస్తున్నామని చెప్పారు. 



Tags:    

Similar News