Supreme Court: నేడు ఆర్టికల్ 360 రద్దుపై తీర్పు
Supreme Court: 23 పిటిషన్లపై సెప్టెంబర్ 5న తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం
Supreme Court: నేడు ఆర్టికల్ 360 రద్దుపై తీర్పు
Supreme Court: ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 16 రోజుల పాటు విచారణ జరిపిన అనంతరం... 23 పిటిషన్లపై సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. బెంచ్‌లో జస్టిస్‌లు ఎస్‌కె కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్ కూడా ఉన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370కి 2019లో కేంద్రం చేసిన మార్పుల రాజ్యాంగ చెల్లుబాటు మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పును వెలువరించనుంది. ఆగస్టు 2న వాదనలు ప్రారంభించిన పిటిషనర్లు జమ్ము కశ్మీర్‌కి ప్రత్యేక హోదా కల్పించే నిబంధన తాత్కాలికమేనని వాదించారు... 23 పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం నేడు తీర్పు ఇవ్వనుంది.