దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గాయి..! EPFO నివేదికలో వెల్లడి.. కారణాలు ఏంటంటే..?

Job Opportunities: నిరుద్యోగులకు గత ఏడాది కాలంగా గడ్డుకాలమనే చెప్పాలి. కరోనా వల్ల చాలామందికి ఉద్యోగాలు పోయాయి.

Update: 2021-12-23 04:46 GMT

దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గాయి..! EPFO నివేదికలో వెల్లడి.. కారణాలు ఏంటంటే..?

Job Opportunities: నిరుద్యోగులకు గత ఏడాది కాలంగా గడ్డుకాలమనే చెప్పాలి. కరోనా వల్ల చాలామందికి ఉద్యోగాలు పోయాయి. ఉపాధి దెబ్బతింది. చాలామంది తినడానికి తిండిలేని పరిస్థితులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వలసకూలీల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇప్పుడిప్పుడే కొంచెం కుదుటపడుతోంది. అయితే గత ఏడాది కాలంగా దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఇది ఎవరో చెప్పింది కాదు ఈపీఎఫ్‌వో ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్ నివేదికలో వెల్లడైంది.

ఈ ఏడాది అక్టోబర్‌లో 12 లక్షల 70 వేల మందికి ఉపాధి లభించగా.. జులై తర్వాత ఇదే అత్యల్పం. జూలైలో 12 లక్షల 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. గత మూడు నెలల్లో మొదటిసారిగా జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశించే ఉద్యోగుల సంఖ్య నిరంతరం తగ్గుతోంది. కెరీర్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వారికి ఇది ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. EPFO డేటా ప్రకారం.. ఆగస్టు నెలలో 14 లక్షల 80 వేల మందికి ఉద్యోగాలు లభించగా, మొదటిసారిగా చేరిన వారి సంఖ్య 9 లక్షల 10 వేలు. తరువాత, సెప్టెంబర్ నెలలో నికరంగా 15 లక్షల 41 వేల మందికి కొత్త ఉపాధి లభించింది. అందులో మొదటి సారిగా EPFOలో ​​చేరిన సభ్యుల సంఖ్య 8 లక్షల 95 వేలు.

ఇప్పుడు అక్టోబర్‌లో మొత్తం 12 లక్షల 70 వేల మందికి ఉపాధి లభించగా మొదటిసారి ఇంత తక్కువ మొత్తంలో 7 లక్షల 50 వేల మంది మాత్రమే కొత్త సభ్యులు అయ్యారు. అక్టోబరులో ప్రభుత్వం ఇచ్చిన 12 లక్షల 70 వేల లెక్కల్లో తొలిసారిగా ఏడున్నర లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించగా ఉద్యోగాలు మారిన వారు 5 లక్షల 10 వేల మంది ఉన్నారు. EPFO (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) అంటే 'ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' భారత ప్రభుత్వానికి చెందిన ఒక సంస్థ. ఇది ఉద్యోగ విరమణ తర్వాత సభ్యులకు ఆదాయ భద్రతను అందించడానికి అనేక పథకాలను అమలు చేస్తుంది.

Tags:    

Similar News