Jobs: ఆర్బీఐ లో 29 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Jobs: ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 29 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన‌ విడుదల చేసింది.

Update: 2021-02-23 03:30 GMT

ఆర్బీఐ (ఫోటో: హన్స్ ఇండియా)


ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 29 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 23 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. మార్చి 10 దరఖాస్తులకు చివరితేది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల‌ 10 తేదీన జరిగే పరీక్ష నిర్వహించబడును. ఆన్‌లైన్ టెస్ట్‌/ రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

పూర్తి వివరాలకు https://www.rbi.org.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు సంఖ్య 29, వివిధ విభాగాల పోస్టులు ఈవిధంగా ఉన్నాయి. లీగ‌ల్  ఆఫీస‌ర్ ఇన్ గ్రేడ్‌-బి 11,మేనేజ‌ర్ (టెక్నిక‌ల్‌-సివిల్‌) 01,అసిస్టెంట్ మేనేజ‌ర్(రాజ్‌భాష) 12, అసిస్టెంట్ మేనేజ‌ర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ) 05.

Tags:    

Similar News