జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. మొత్తం 5 దశల్లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు. తొలిదశ ఈ నెల 30 న ఎన్నికలు జరుపుతామని.. రెండో దశ డిసెంబర్ 7 న, మూడోదశ డిసెంబర్ 12న, నాలుగోదశ డిసెంబర్ 16 న, డిసెంబర్ 20 న చివరి ఐదో దశ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 23 న జరుగుతుందని.. తెలిపారు. వచ్చే ఏడాది జనవది 5 తో.. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుందని.. సునీల్ అరోరా తెలిపారు.