జయలలిత మరణంపై అనేక అనుమానాలు : స్టాలిన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి కమిషన్‌ నియమితమైన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌ ఏర్పడి మూడున్నర..

Update: 2020-10-19 01:52 GMT

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి కమిషన్‌ నియమితమైన విషయం తెలిసిందే. ఈ కమిషన్‌ ఏర్పడి మూడున్నర సంవత్సరాలు పూర్తవుతోంది. అయితే ఇంత వరకు ఎటువంటి ఆధారాలను ఈ కమిషన్ బయటపెట్టలేదు. ఈనెల 24వ తేదీతో పొడిగించిన గడువు కూడా ముగియంది. మరో 3 నెలలు గడువు పొడిగించాలని ఆర్ముగస్వామి కమిషన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది.. అయితే జయలలిత మరణం వెనుక అనుమానాలున్నాయని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. జయలలిత మిస్టరీ నిగ్గుతేల్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు.

వారిద్దరూ ఆడుతున్న నాటకం ఆర్ముగస్వామి కమిషన్ లేఖ ద్వారా బట్టబయలైందని ఆరోపించారు. జయలలిత మృతిచెంది నాలుగేళ్లు కావొస్తున్నా, ఆమె మరణంపై నెలకొన్న అనేక అనుమానాలు ఇంతవరకు నివృతి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టాలిన్‌. ఆర్ముగస్వామి కమిషన్‌ ఏర్పడి 37 నెలలు ఆవుతోన్నా.. ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వకుండా ఇంకా గడువు కోరడం ఏంటని ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ న్యాయవాదుల తీరుపై ఆ కమిషన్‌ లేఖ రాయడం చూస్తే, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని బయటకు తీసుకురావడంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు చిత్తశుద్ధి లేదనే విషయం అర్ధమవుతుందని అన్నారు. 

Tags:    

Similar News