Jawan Jaswant Reddy: సొంతగ్రామానికి వీర జవాన్‌ జశ్వంత్‌రెడ్డి డెడ్‌బాడీ

Jawan Jaswant Reddy: వీర జవాన్ జస్వంత్ రెడ్డి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Update: 2021-07-10 04:10 GMT

Jawan Jaswant Reddy Dead Body:(The Hans India)

Jawan Jaswant Reddy: నియంత్రణ రేఖ వెండబడి జరుగుతున్న ఉగ్రపోరులో మరో తెలుగు బిడ్డ వీరమరణం పొందిన జశ్వంత్ రెడ్డి(23) డెడ్ బాడీ సొంత గ్రామం గుంటూరు జిల్లా బాపట్లకు చేరుకుంది. కొద్దిసేపట్లో జస్వంత్ రెడ్డి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెం స్మశానవాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జస్వంత్‌రెడ్డి అంత్యక్రియల్లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొననున్నారు. బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కశ్మీర్ లోని రాజౌరి జిల్లా సుందర్ బనీ సెక్టార్ లో టెర్రరిస్టులతో గురువారం అర్థరాత్రి జరిగిన పోరులో ఎదురొడ్డి పోరాడాడు జశ్వంత్‌రెడ్డి. ఉగ్రవాదులపై బులెట్ల వర్షం కురిపించాడు. ఆ శత్రు మూకల అడుగు దేశం లోపల పడకుండా కాల్చి చంపాడు. జశ్వంత్ 2016లో మద్రాసు రెజిమెంట్ లో సైన్యంలో చేరారు. తొలుత నీలగిరిలో పనిచేసిన ఈయన ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల క్రితం సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లారు. మరో నెల రోజుల్లో అతనికి వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఉగ్రవాదుల కాల్పుల్లో కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతన్ని తలచుకుని కొత్తపాలెం గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

జవాన్ జశ్వంత్ రెడ్డి చరస్మరణీయుడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 'దేశ రక్షణలో భాగంగా తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన జశ్వంత్ రెడ్డి త్యాగం నిరుపమానం. మన జవాను చూపిన అసమాన ధైర్య సాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారు అని అన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50లక్షల ఆర్థకి సహాయం అందిస్తుందని' అని ప్రకటించారు. జవాన్ జశ్వంత్ రెడ్డి మృ చెందడం పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News