జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బదిలీ.. కొత్త గవర్నర్లు వీరే..

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలకు నూతన లెఫ్టినెంట్ గవర్నర్లను కేంద్ర నియమించింది. ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను గోవాకు బదిలీ చేసింది.

Update: 2019-10-25 15:45 GMT

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలకు నూతన లెఫ్టినెంట్  గవర్నర్లను కేంద్ర నియమించింది. ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను గోవాకు బదిలీ చేసింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మాజీ ఐఏఎస్ అధికారి గిరిష్ చంద్ర ముర్ము, లద్ధాక్ గవర్నర్ గా రాధాకృష్ట మాథూర్ లను నియమించింది. ఈనెల 31 నుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

అలాగే విజోరాంకు గవర్నర్ గా శ్రీధరన్ పిళ్లెని నియమించింది. జమ్మూకశ్మీర్ నూతన గవర్నర్ గా నియమితులైన గిరీశ్ చంద్ర 1985 బ్యాచ్ చెందిన గుజరాత్ ఐఏఎస్ అధికారి. లద్ధా్క్ గవర్నర్ గా నియమితులైన మాథుర్ 1977 బ్యాచ్ కు చెందిన త్రిపుర క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి.ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులను నియమించడం విశేషం. 

Tags:    

Similar News