Pakistani Drone: సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్‌.. కూల్చేసిన భద్రతా సిబ్బంది

Pakistani Drone: డ్రోన్‌ నుంచి 7 గ్రెనేడ్‌ లంచర్లు, ఏడు బాంబులు స్వాధీనం

Update: 2022-05-29 09:06 GMT

Pakistani Drone: సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్‌.. కూల్చేసిన భద్రతా సిబ్బంది

Pakistani Drone: జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్‌ కలకలకం సృష్టించింది. కతువా జిల్లాలోని టల్లి హరియా చౌక్‌ వద్ద ఉదయం పాకిస్థాన్‌ సరిహద్దు దాటి వస్తున్న డ్రోన్‌ను గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే దాన్ని కూల్చేశారు. ఆ డ్రోన్‌కు కొన్ని పేలుడు పదార్థాలు జతచేసి ఉండడాన్ని గమనించి బాంబ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. డ్రోన్‌లో 7 గ్రెనేడ్‌ లాంచర్లు, ఏడు బాంబులు, బుల్లెట్లను భద్రతా దళాలు గుర్తించాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌లను భారీగా పంపుతోంది. సరిహద్దులోని నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని కూల్చేస్తున్నారు.

Tags:    

Similar News