Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మరో మేఘ విస్ఫోటం.. నలుగురు దుర్మరణం

జమ్మూకశ్మీర్‌లో వరుసగా మేఘ విస్ఫోటాలు సంభవిస్తూ ప్రాణ నష్టాలు కలిగిస్తున్నాయి. కిశ్త్‌వాడ్ జిల్లాలో జరిగిన ఘటన మరువకముందే, కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మరోసారి మేఘ విస్ఫోటం జరిగింది.

Update: 2025-08-17 04:53 GMT

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మరో మేఘ విస్ఫోటం.. నలుగురు దుర్మరణం

జమ్మూకశ్మీర్‌లో వరుసగా మేఘ విస్ఫోటాలు సంభవిస్తూ ప్రాణ నష్టాలు కలిగిస్తున్నాయి. కిశ్త్‌వాడ్ జిల్లాలో జరిగిన ఘటన మరువకముందే, కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మరోసారి మేఘ విస్ఫోటం జరిగింది. ఈ విపత్తులో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారని అధికారులు ధృవీకరించారు.

స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం, విస్ఫోటం తర్వాత కొండచరియలు విరిగిపడటంతో ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ ప్రాంతంలో ఒక కుటుంబం శిథిలాల కింద ఇరుక్కుపోయింది. వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సహాయక చర్యలకు దిగింది.

భారీ వర్షాల కారణంగా సహాక్ ఖాద్, ఉజ్ నదుల్లో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారులతో పాటు పలు మార్గాలపై రవాణా పూర్తిగా నిలిచిపోయింది. కథువా పోలీస్ స్టేషన్‌లోకే వరద నీరు చేరింది.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, సహాయక చర్యలు వేగవంతం చేయాలని స్థానిక అధికారులకు సూచించినట్లు తెలిపారు. మరోవైపు, జిల్లా అధికారులు వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తూ, రాబోయే రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అలాంటి ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇటీవల మచైల్ మాతా దేవి యాత్రికులపై కూడా మేఘ విస్ఫోటం సంభవించి 60 మంది ప్రాణాలు కోల్పోగా, 82 మంది గల్లంతైన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News