దొరికిన తబ్లిగ్ జమాత్ చీఫ్ ఆచూకీ

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో తబ్లిగ్ జమాత్ సమావేశం నిర్వహించిన జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ ఆచూకీ దొరికింది.

Update: 2020-04-08 08:44 GMT
Maulana Saad

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో తబ్లిగ్ జమాత్ సమావేశం నిర్వహించిన జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ ఆచూకీ దొరికింది. దేశ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమైన తాబ్లిగ్ జమాత్ చీఫ్ సాద్‌పై పోలీసులు కేసు రిజిస్టర్ చేయడంతో ఆయన పరారయ్యారు.

ఢిల్లీ, యూపీలోని ముజఫర్ నగర్, షామ్లీ ప్రాంతాల్లో మౌలానా ముహమ్మద్ సాద్ కోసం ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు మౌలానా ముహమ్మద్ సాద్ ఆచూకీని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధవారం కనుగొన్నారు. ఢిల్లీలోని జాకీర్ నగర్ లోని తన నివాసంలో మౌలానా సాద్ క్వారంటైన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో జమాత్ సమావేశాన్ని రద్దు చేయాలని పలువురు ఇస్లామిక్ మతాధికారులు సూచించినా... మౌలానా సాద్ వినలేదు. దీంతో జమాత్ సమావేశం నిర్వహించడంతో వేల మంది సభ్యులు ఆరోగ్యం ప్రమాదం పడినట్లయింది. గతంలో జమాత్ సభ్యులు వైద్యులకు సహకరించాలని కోరుతూ ఆడియో సందేశాన్ని మౌలానా సాద్ విడుదల చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా తబ్లిగ్ జమాత్ వెళ్ళివచ్చిన వారు అధికంగా వున్నారు. ఎక్కువమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే జమాత్ సభ్యులను గుర్తించి వారికి క్వారంటైన్, ఇసొలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News