Coronavirus: ఇటలీ,స్పెయిన్ లో పెరిగిన మరణాల సంఖ్య చూస్తే..

కరోనా వైరస్ మహమ్మారి ఇటలీ, స్పెయిన్ దేశాలను కుదిపేస్తోంది. రోజురోజుకు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

Update: 2020-03-25 02:23 GMT

కరోనా వైరస్ మహమ్మారి ఇటలీ, స్పెయిన్ దేశాలను కుదిపేస్తోంది. రోజురోజుకు వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇటలీలో మరణాల సంఖ్య మంగళవారం 743 పెరిగింది, గణాంకాల ప్రకారం 6,820 మంది సంక్రమణతో ఒక నెల వ్యవధిలోనే మరణించారు. మంగళవారం నమోదైన సంఖ్య ఫిబ్రవరి 21 తరువాత ఉత్తర ప్రాంతాలలో నమోదైన రెండవ అత్యధిక రోజువారీ సంఖ్య. గత శనివారం 602 మరణాలు నమోదయ్యాయి, అంతకుముందు 793 మరణాలు సంభవించాయి. ఇక మొత్తం ధృవీకరించబడిన కేసుల సంఖ్య మంగళవారం 69,176 ను తాకింది.

మంగళవారం స్పెయిన్లో ఒకేరోజు 514 మరణాలు సంభవించాయి. వ్యాప్తి చెందిన తరువాత ఇదే అతిపెద్ద సంఖ్య.. దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 2,696 కు చేరుకుంది. అంతేకాదు 6,600 కొత్త కరోనావైరస్ కేసులను కూడా నివేదించింది, దీంతో దేశవ్యాప్తంగా అంటువ్యాధుల సంఖ్య 39,673 కు పెరిగింది.

అయితే ఇటలీలో తీవ్రమైన లక్షణాలతో ఉన్నవారిని మాత్రమే పరీక్షించడంతో.. వ్యాధి సోకిన వారి సంఖ్య బహుశా 10 రెట్లు ఎక్కువ ఉంటుందని సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధిపతి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 10 లో ఒక ధృవీకరించబడిన కేసు ఉండే అవకాశం ఉందని.. సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధిపతి ఏంజెలో బొర్రెల్లి అన్నారు.. లా రిపబ్లికా వార్తాపత్రికతో మాట్లాడుతూ, 700,000 మందికి వ్యాధి సోకినట్లు తాను నమ్ముతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఇటలీలో కరోనావైరస్ సంక్రమణ రేటు మందగించిందని భరోసా ఇచ్చే ఆధారాలు కూడా ఉన్నాయి. అధికారికంగా నమోదైన కొత్త అంటువ్యాధులు కేవలం 8 శాతం మాత్రమే పెరిగాయి. ఇక రెండు వారాలుగా ఇటలీ లాక్డౌన్ లోనే ఉంది, పాఠశాలలు, బార్‌లు మరియు రెస్టారెంట్లు మూసివేయబడ్డాయి.. ఇటాలియన్లు తమ ఇళ్లను విడిచిపెట్టకుండా ప్రభుత్వ అధికారులు నిషేధం విధించారు. అయినా కూడా కొంతమంది ప్రజలు బయట తిరుగుతుండటంతో ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అలా తిరిగే వాళ్ళని వారి GPS, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి వారిని జైళ్లలో వేస్తున్నారు.

ఇదిలావుంటే స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు కొన్ని వారాల పాటు లాక్ డౌన్ తో ఇటలీ అడుగుజాడల్లో నడుస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


Tags:    

Similar News