PSLV-C54 Launch: PSLV C-54 ప్రయోగం సక్సెస్

PSLV-C54 Launch: కక్ష్యలోకి 9 ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన PSLV C-54

Update: 2022-11-26 07:28 GMT

PSLV-C54 Launch: PSLV C-54 ప్రయోగం సక్సెస్

PSLV-C54 Launch: శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన PSLV-C54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.PSLV C-54 రాకెట్‌ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఈవోఎస్‌ శాట్‌-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది. ఓషన్‌శాట్‌ ఉపగ్రహాల ద్వారా భూవాతావరణం పరిశీలన, తుపానులను పసిగట్టడం, వాతావరణంలో తేమ అంచనా, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. హైపర్‌ స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం.. మీథేన్‌ లీకులు, భూగర్భ చమురు, పంటలకొచ్చే తెగుళ్లను గుర్తించేందుకు దోహదపడుతుంది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇప్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

Full View
Tags:    

Similar News