Gaganyaan Mission: తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఇస్రో సన్నాహాలు

Gaganyaan Mission: ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 కోసం సన్నాహాలు ప్రారంభం

Update: 2023-10-07 05:47 GMT

Gaganyaan Mission: తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఇస్రో సన్నాహాలు

Gaganyaan Mission: భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఈ యాత్ర మధ‌్యలో వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకునేందుకు వీలుగా పొందుపర్చనున్న అబార్ట్ మిషన్ వన్ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇస్రో ట్వీట్ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇద్దరు వ్యోమగాములను మూడు రోజుల పాటు భూమి నుంచి 400 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి తీసుకెళ్తారు. ఇక అక్టోబర్ నెలాఖరు వరకు ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ఇస్రో కంకణం కట్టుకుంది.


Tags:    

Similar News