IRCTC Nashik Tour: ఐఆర్ సీటీసీ షిర్డీ, నాసిక్ టూర్ ప్యాకేజ్.. రూ.4వేలకే ట్రిప్

IRCTC Nashik Tour: వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని ఐఆర్ సీటీసీ ఈ ఏడాది కూడా టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది.

Update: 2023-05-14 06:30 GMT

IRCTC Nashik Tour: ఐఆర్ సీటీసీ షిర్డీ, నాసిక్ టూర్ ప్యాకేజ్.. రూ.4వేలకే ట్రిప్

IRCTC Nashik Tour: వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని ఐఆర్ సీటీసీ ఈ ఏడాది కూడా టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే షిరిడి సాయి భక్తుల కోసం సాయి శివం పేరుతో టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా నాసిక్ త్రయంబకేశ్వర్, షిరిడి ఆలయం, పంచవటి వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి ప్రారంభం అయ్యే ఈ టూర్ 3 రాత్రులు 4 రోజులు కొనసాగుతుంది.

టూర్ షెడ్యూల్

తొలి రోజు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 06:50 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నంబర్ 17064 (అజంతా ఎక్స్ ప్రెస్) రాత్రంతా జర్ని ఉంటుంది.

రెండవ రోజు: రెండో రోజు ఉదయం 07:10 గంటలకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ మిమ్మల్ని ఐఆర్ సిటీసీ వాహనం పికప్ చేసుకొని షిరిడీకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత హోటల్ లో చెక్ ఇన్ ఉంటుంది. అనంతరం షిరిడీ సాయి బాబా దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రి బస అక్కడే ఉంటుంది.

మూడవ రోజు: మూడో రోజు అల్పాహారం అనంతరం షిరిడీ హోటల్ నుంచి చెక్ ఔట్ అవుతారు. అక్కడ నుంచి నాసిక్ లోని త్రయంబకేశ్వర్ కు వెళతారు. అనంతరం పంచవటి దర్శనం ఉంటుంది. తర్వాత నాగర్ సోల్ స్టేషన్ లో రాత్రి 8:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

నాల్గవ రోజు: నాల్గవ రోజు ఉదయం 8:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ రేట్లు

టికెట్ రేట్ల విషయానికొస్తే..స్టాండర్డ్ క్లాస్ లో నలుగురు నుంచి ఆరుగురు ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4940, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4200 చెల్లించాల్సి ఉంటుంది. ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,730 డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6550, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4910గా ధర నిర్ణయించారు. కంఫర్ట్ క్లాసులో నలుగురు నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీని బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5890 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు ప్రత్యేక ధరలు ఉన్నాయి.




Tags:    

Similar News