Satyendar Jain: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్రజైన్‌కు మధ్యంతర బెయిల్‌

Satyendar Jain: 6 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Update: 2023-05-26 07:18 GMT

Satyendar Jain: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్రజైన్‌కు మధ్యంతర బెయిల్‌

Satyendar Jain: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న ఆప్‌ నేత, దిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ ఆరోగ్యం మరింత క్షీణించి కారణంగా ఆయనకు సుప్రీంకోర్టు 6వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిన్న ఆయన జైలు గదిలోని బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయారు. దీంతో జైలు అధికారులు వెంటనే ఆయన్ను దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో నగరంలోని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన ఆక్సిజన్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు జైలు అధికారిక వర్గాలు వెల్లడించాయి.సత్యేందర్‌ జైన్‌ ఆరోగ్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటన చేసింది. బాత్‌రూమ్‌లో కళ్లుతిరగడంతో ఆయన కిందపడిపోయారని, దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారని తెలిపింది. అయితే, గతంలో ఆయన ఇలాగే ఓసారి బాత్‌రూమ్‌లో పడిపోవడంతో వెన్నెముకకు తీవ్ర గాయమైందని తెలిపింది. మరోవైపు, గత సోమవారం కూడా జైన్‌ అస్వస్థతకు గురవడంతో జైలు అధికారులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు బయటికొచ్చిన చిత్రాలు ఆప్‌ నేతలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అందులో ఆయన బక్కచిక్కి పోయి చాలా నీరసంగా కన్పించారు. వెన్నెముకకు గాయమవడంతో నడుముకు బెల్ట్‌ పెట్టుకున్నారు.

Tags:    

Similar News