Venkaiah Naidu: పార్టీ మారిన వారు రాజీనామా చేసి పోటీ చేయాలి
Venkaiah Naidu: ఫిరాయింపులను ప్రోత్సహించవద్దు
Venkaiah Naidu: పార్టీ మారిన వారు రాజీనామా చేసి పోటీ చేయాలి
Venkaiah Naidu: రాజకీయ నాయకుల పార్టీ మార్పులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పద్మవిభూషణ్ అవార్డు స్వీకరించిన సందర్భంగా ఆయన నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మారిన వారు వెంటనే వారి పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని అన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని కోరారు. ఫిరాయింపుల చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఇక ఉచిత హామీలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలిస్తున్నాయన్న ఆయన.. ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు కరెక్ట్ కాదన్నారు.