Delhi Farmers Protest: రైతుల ఆందోళనలతో ఢిల్లీలో హైఅలర్ట్

* జంతర్ మంతర్‌లో భారీగా భద్రత పెంపు * హింస చెలరేగే అవకాశముందని ఇంటలిజెన్స్ వార్నింగ్

Update: 2021-07-22 04:22 GMT

ఢిల్లీలో రైతుల ఆందోళన(ఫైల్ ఫోటో)

Delhi Farmers Protest: ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో భద్రతను భారీగా పెంచారు. హింస చెలరేగుతుందన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఈరోజు జంతర్ మంతర్‌లో మాక్ పార్లమెంట్‌ నిర్వహించనున్న రైతులు భారీ ర్యాలీకి చేయనున్నారు. అయితే, రైతుల ర్యాలీలో హింస చెలరేగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

రైతుల ర్యాలీలో పెద్దఎత్తున హింస చెలరేగొచ్చని ఇంటలిజెన్స్ హెచ్చరించింది. ర్యాలీ మాటున ఖలిస్థాన్ ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశముందని తెలిపింది. రెడ్‌ పోర్ట్‌‌పై దాడి మాదిరిగా ప్రభుత్వ ఆస్తులను టార్గెట్ చేసే ఛాన్సు ఉందని ఇంటలిజెన్స్ వార్నింగ్ ఇచ్చింది. దాంతో, ఢిల్లీ వీధుల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. కేవలం రెండొందల మందిని మాత్రమే ర్యాలీలో పాల్గొనేలా పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే, జంతర్ మంతర్‌కు భారీగా తరలివచ్చేందుకు రైతు సంఘాలు ప్లాన్ చేశాయి.

Tags:    

Similar News