INS Arnala: INS అర్నాలా.. ఇక శత్రువులు గజగజ వణికిపోవాల్సిందే

INS Arnala: INS అర్నాలా అనేది ఒక యుద్ధ నౌక. ఇది మనదేశంలోనే తయారైంది. విశాఖపట్నంలో ఉండే ఒక షిప్‌ బిల్డింగ్ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఈ నౌకను స్పెషల్‌గా నీటిలో దాగి తిరిగే శత్రు సబ్‌మరిన్లను పట్టుకోవడానికి తయారు చేశారు.

Update: 2025-06-20 00:30 GMT

INS Arnala: INS అర్నాలా.. ఇక శత్రువులు గజగజ వణికిపోవాల్సిందే

INS Arnala: INS అర్నాలా అనేది ఒక యుద్ధ నౌక. ఇది మనదేశంలోనే తయారైంది. విశాఖపట్నంలో ఉండే ఒక షిప్‌ బిల్డింగ్ కంపెనీ దీన్ని తయారు చేసింది. ఈ నౌకను స్పెషల్‌గా నీటిలో దాగి తిరిగే శత్రు సబ్‌మరిన్లను పట్టుకోవడానికి తయారు చేశారు. అంటే మనకు కనపడకుండా, ఎక్కడో దాగి ఉన్న శత్రు సబ్‌మరిన్లను అట్టే గుర్తించి వెంటపడుతుంది ఈ అర్నాలా. పాత నౌకల పేరుతో కొత్త టెక్నాలజీ కలిపి ఈ INS అర్నాలాను తీర్చిదిద్దారు. ఇది చాలా మోడ్రెన్‌గా ఉంది. శత్రువు ఎక్కడ ఉందో కనిపెట్టే సోనార్‌లు, దాన్ని అటాక్ చేసే టార్పీడోల లాంటి హంగులన్నీ ఇందులో ఉన్నాయి. శత్రువు ఈ షిప్‌ను గుర్తించకుండానే.. ఇది వారి దగ్గరకి వెళ్లి మరి దాడి చేసేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ నౌక పొడవు సుమారు 105 మీటర్లు. ఇది నీటిలో 25 నాటికల్ మైళ్ళ స్పీడ్‌తో వెళ్తుంది. ఒకసారి బయలుదేరితే చాలా దూరం ప్రయాణించగలదు. ఎంత అంటే దాదాపు 3,500 నాటికల్ మైళ్ళ దూరం అనుకోండి. అంటే ఇది సముద్రంలో ఎక్కువ రోజులు కాపలా కాసే శక్తి కలిగిన నౌకన్నమాట.

మనం ఇప్పటివరకు ఎక్కువగా ఇతర దేశాల నుంచి వచ్చిన నౌకలపైనే ఆధారపడే వాళ్లం. కానీ ఇప్పుడు మనకోసం మనమే తయారు చేసుకున్నాం. అది కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడగల నౌక. ఈ నౌక ప్రస్తుతం చైనా సముద్రంలో తన ప్రెజెన్స్ చూపిస్తుంటే, మన దేశం కూడా బలంగా ఉందని చెప్పడానికే ఇది ఒక సింబల్ లా మారింది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది కేవలం ఓ నౌక రాక మాత్రమే కాదు.. INS అర్నాలా మన దేశానికి ఓ స్ట్రాంగ్ సపోర్ట్. ఇది శత్రువుల మీద సైలెంట్ అటాక్ చేయగలదు. ఇది మన నౌకాదళాన్ని మరింత బలంగా మారుస్తోంది. స్వదేశీ టెక్నాలజీతో, మనమే తయారు చేసుకున్న ఈ నౌక మన భద్రతలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.

Tags:    

Similar News