అనాథాశ్రమంలో అరాచకాలు.. మహిళలపై నిర్వాహకుల అఘాయిత్యాలు.. ఇనుప సంకెళ్లతో కట్టేసి కోతులతో కరిపిస్తున్న..
Anbu Jothi Ashram: కర్కశత్వం, అత్యాచారాలకు నిలయంగా మారింది తమిళనాడులోని ఓ అనాథాశ్రమం.
అనాథాశ్రమంలో అరాచకాలు.. మహిళలపై నిర్వాహకుల అఘాయిత్యాలు.. ఇనుప సంకెళ్లతో కట్టేసి కోతులతో కరిపిస్తున్న..
Anbu Jothi Ashram: కర్కశత్వం, అత్యాచారాలకు నిలయంగా మారింది తమిళనాడులోని ఓ అనాథాశ్రమం. నా అనేవాళ్లు లేని అనాథలను అక్కున చేర్చుకోవాల్సిన నిర్వాహకులు పాడుపనులకు తెగబడుతున్నారు. విల్లుపురం జిల్లా గుండల పులియూర్ గ్రామంలో ఉన్న అన్బు జ్యోతి అనాధాశ్రమంలో ఈ అరాచకాలు బయటపడ్డాయి. ఈ ఆశ్రమంలో మానసిక వికలాంగులు, భర్తను కోల్పోయిన మహిళలు తలదాచుకుంటున్నారు. ఆశ్రమంలో ఉన్న 142 మందిలో 109 మంది పురుషులు కాగా 33 మంది మహిళలు. వారిలో ప్రస్తుతం 16 మంది మిస్సింగ్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
వీరిపై ఆశ్రమ నిర్వాహకులు పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. మానసిక వికలాంగ మహిళలకు మత్తుమందిచ్చి రాడ్లతో దాడి చేసి నిర్వాహకులు అత్యాచారం చేశారు. తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయడమేకాకుండా, ఇనుప సంకెళ్లతో కట్టేసి కోతులతో కరిపించారని ఒడిశాకు చెందిన మహిళ.. పోలీసులకు కంప్లయింట్ చేసింది. దీంతో ఆశ్రమంపై రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేసి ఆశ్రమంలోని బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.