ఢిల్లీ నుంచి లేహ్ వెళ్తున్న ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..ఫ్లైట్ లో 180 మంది ప్రయాణికులు
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇండిగోకు చెందిన 6ఈ 2006 విమానం గురువారం ఉదయం ఢిల్లీ నుంచి లెహ్ కు బయలుదేరింది.
ఢిల్లీ నుంచి లేహ్ వెళ్తున్న ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్..ఫ్లైట్ లో 180 మంది ప్రయాణికులు
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇండిగోకు చెందిన 6ఈ 2006 విమానం గురువారం ఉదయం ఢిల్లీ నుంచి లెహ్ కు బయలుదేరింది. అయితే మధ్యలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఢిల్లీలో అత్యవసరంగా సేఫ్ ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, క్రూ సిబ్బంది మొత్తం 180 మంది ఉన్నారు. ఈ విషయాన్ని ఇండిగో కూడా ధ్రువీకరించింది. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.