క్రమంగా తగ్గుతున్న ఇండిగో సంక్షోభం : ప్రభుత్వ ఆదేశాలతో 10% ఆపరేషనల్ రద్దులు

ఇండిగోలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. విమాన సర్వీసుల రద్దులు పెరగడం, ఆపరేషనల్ లోపాలు బయటపడడం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా సమీక్షిస్తోంది.

Update: 2025-12-10 07:31 GMT

క్రమంగా తగ్గుతున్న ఇండిగో సంక్షోభం : ప్రభుత్వ ఆదేశాలతో 10% ఆపరేషనల్ రద్దులు

ఇండిగోలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి. విమాన సర్వీసుల రద్దులు పెరగడం, ఆపరేషనల్ లోపాలు బయటపడడం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఆకస్మిక తనిఖీలు ప్రారంభించగా, ఇండిగోలో పైలట్ల లభ్యత సమస్యలు, నిర్వహణలో గ్యాప్‌లు, సాంకేతిక తనిఖీల లోపాలపై డీజీసీఏ ప్రత్యేక బృందాలు దృష్టి పెట్టాయి.

ఇదిలా ఉండగా, సంస్థపై మరింత ఒత్తిడి తీసుకొస్తూ విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో తన మొత్తం ఆపరేషన్లలో 10 శాతం సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో సుమారు 200 విమాన సర్వీసులు తగ్గించాల్సి రావచ్చు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డాయి.

అంతేకాకుండా, ఇండిగోకు కేటాయించిన కొన్ని రూట్లను రద్దు చేసే అవకాశాన్ని డీజీసీఏ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సిబ్బంది లభ్యత, భద్రతా ప్రమాణాలు, సర్వీసుల నిరంతరత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కొన్ని రూట్లలో మార్పులు చేయనున్నట్లు సమాచారం.

ఈ చర్యలతో ఇండిగో సంక్షోభం కొంతవరకు నియంత్రణలోకి వస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో సేవలు అందించే సంస్థ కావడంతో వచ్చే కొన్ని రోజులు ప్రయాణికులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని విమానయాన వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News