Mrs World: 21ఏళ్ల తర్వాత భారత్‌కు మిసెస్ వరల్డ్ కిరీటం
Mrs World: మిసెస్ వరల్డ్ పోటీల్లో విజేతగా భారత్‌కు చెందిన సర్గమ్ కౌశల్
Mrs World: 21ఏళ్ల తర్వాత భారత్‌కు మిసెస్ వరల్డ్ కిరీటం
Mrs World: భారత్‌కు చెందిన సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్- 2022 టైటిల్‌ను సొంతం చేసుకుంది. వెస్ట్‌గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో జరిగిన కార్యక్రమంలో 2021 విజేత అమెరికాకు చెందిన షైలిన్ ఫోర్డ్.. సర్గమ్ కౌశల్‌కు కిరీటాన్ని బహూకరించింది. 63 దేశాలకు చెందిన మహిళలను ఓడించి కిరీటాన్ని సొంతం చేసుకుంది. పోటీల్లో పాలినేషియా, కెనడాకు చెందిన వనితలు రన్నరప్స్‌గా నిలిచారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్ నుంచి సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్‌గా ఎంపికైనట్లు మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.