ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి.. 'భారత్‌ కంపెనీల సిరప్‌లే కారణం'

*పూర్తి వివరాలు ఇవ్వాలని ఉజ్బికిస్తాన్ ఆరోగ్య శాఖను కోరిన కేంద్రం

Update: 2022-12-29 07:24 GMT

ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి.. ‘భారత్‌ కంపెనీల సిరప్‌లే కారణం’

Uzbekistan Syrup: ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారుల మృతి ఘటనపై తీవ్ర కలకలం చెలరేగుతోంది. పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌ కారణమని ఉజ్బెకిస్తాన్‌ ఆరోపించింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు నోయిడాకు చెందిన మారియన్‌ బయోటెక్‌ తయారు చేసిన డాక్‌-1 మాక్స్‌ దగ్గు మందు తాగి మృతి చెందారంటోంది. ఈ సిరప్‌లపై నిర్వహించిన ల్యాబరేటరీ పరీక్షల్లో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ కనుగొన్నట్లు వెల్లడించింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పూర్తి వివరాలు అందించాలని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది. అయితే ఈ సిరప్‌ను ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వర్గాలు తెలిపాయి. భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌లపై ఆరోపణలు రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. గతంలో ఆఫ్రికన్‌ దేశమైన గాంబియాలో 70 మందికిపైగా పిల్లలు మృతి చెందారు. 18 మంది చిన్నారుల మృతికి గల కారణాలు ఇంకా తేలాల్సి ఉందన్నారు మారియన్ బయోటెక్ కంపెనీ తరఫు లీగల్ అడ్వయిజర్ హసన్ హారీస్. ప్రభుత్వం అధికారులు శాంపిల్స్ తీసుకెళ్లారని చెప్పారు. ప్రభుత్వ విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News