Oxygen Express: 'ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌'లు నడిపేందుకు సిద్ధమైన రైల్వే శాఖ

Oxygen Express: ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ముందుకొచ్చిన రైల్వే శాఖ * పరుగులు తీయనున్న 'ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్' రైళ్లు

Update: 2021-04-19 01:48 GMT

ఆక్సిజన్ ట్యాంకులు (ఫైల్ ఇమేజ్)

Oxygen Express: కరోనా ఉధృతితో దేశంలో ఆక్సిజన్‌కు తీవ్ర డిమాండ్‌ ఏర్పడిన వేళ.. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. మెడికల్ ఆక్సిజన్​ను దేశవ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఈ రైళ్లకు ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్​గా నామకరణం చేసింది. ఈ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆక్సిజన్​ను సేకరిస్తుందని రైల్వే శాఖ తెలిపింది.

ఖాళీ ట్యాంకులతో ఉన్న రైలు సోమవారం ముంబయి నుంచి బయలుదేరి విశాఖపట్నం, భిలాయ్‌, జంశెద్​పుర్, రాఉర్కెలా, బొకారోలో ఉన్న ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆక్సిజన్‌ను సేకరిస్తుంది. రైళ్లు ఆక్సిజన్‌ను సేకరించిన తర్వాత డిమాండ్‌ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ సాఫీగా ప్రయాణం సాగించేలా హరిత కారిడార్‌ను సృష్టిస్తామని తెలిపింది.

Full View


Tags:    

Similar News