Indian Railways: దేశ రైల్వే చరిత్రలో తొలి సారి సరికొత్త రికార్డ్..

Indian Railways: బండి బండి రైలు బండి వేళకంటు రాదులేండి.. అంటూ ఓ సినిమాలో వచ్చే గీతం..

Update: 2020-07-02 10:57 GMT

Indian Railways: బండి బండి రైలు బండి వేళకంటు రాదులేండి.. అంటూ ఓ సినిమాలో వచ్చే గీతం.. అయితే ప్రయాణికులు సైతం రైలు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోదు అనే అభిప్రాయంతో ఉంటారు. అయితే భారతీయ రైల్వే తొలిసారి చరిత్ర సృష్టించింది. భారతీయ రైల్వేల చరిత్రలో తొలిసారి అన్ని రైళ్లు వందకు వంద శాతం సరైన సమయానికి చేరుకున్నాయి. ఈ అద్భుత ఘట్టం గురువారం ఆవిష్కృతమైంది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ సడలుంపుల తర్వాత 230 ప్రత్యేక రైళ్లు మాత్రమే రైల్వే శాఖ నడుపుతుంది. దేశవ్యాప్తంగా 13వేల రైళ్లు ఉన్నాయి. అందులో 200 రైళ్లు అంటే 2 శాతం కన్నా కూడా తక్కువే. ఆ రైళ్లను కచ్చితమైన సమయానికి గమ్యస్థానాలకు చేరేలా చూడాలంటూ రైల్వే శాఖ ఆయా జోన్లను ఆదేశించింది. అన్ని రైళ్లు 100 శాతం సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకున్నాయి. గతంలో జూన్ 23, 2020న ఒకరైలు ఆలస్యంగా వచ్చింది. దీంతో రికార్డు 99.54 శాతంగా నమోదైంది. అని రైల్వే శాఖ చెప్పినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకటించింది.

రైల్వే బోర్డు చైర్మన్ వైకే యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం 30 రాజధాని రైళ్లతోపాటు 200 ప్రయాణికుల రైళ్లు ఆలస్యంగా నడవకుడదని, నిర్ణీత సమయానికి చేరుకోవాలని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లను ఆదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్య తక్కువే అయినా ఆలస్యం కావొద్దని స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - హౌరా మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల వరకు పెంచేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రూట్లలో ఫిట్ నెస్, సిగ్నలింగ్ సిద్ధమైందని తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ 2 రూట్లలో రైళ్ల వేగాన్ని పెంచి నడపనున్నారు.

మరోవైపు రైల్వేను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది. కేంద్రం మొత్తం 109 రూట్లలో ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లకు అనుమతిచ్చింది. ఈ మేరకు రైల్వేల్లో ప్రైవేట్ సంస్థల.. భాగస్వామ్యం కోసం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (RFQ)కు కేంద్రం ఆహ్వానించింది. 

Tags:    

Similar News