Pulitzer Prize: భారత సంతతి జర్నలిస్టులకు అరుదైన గౌరవం

Pulitzer Prize: చైనా ముస్లిం నిర్బంధ కేంద్రాలను బయటపెట్టిన మేఘా రాజగోపాలన్‌కు అవార్డు

Update: 2021-06-13 03:50 GMT
భారత జర్నలిస్ట్ మేఘ రాజగోపాలన్ (ఫైల్ ఇమేజ్)

Pulitzer Prize: భారత సంతతికి చెందిన ఇద్దరు జర్నలిస్ట్‌లకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కరాల్లో ఒకటైన పులిట్జర్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. చైనాలోని కల్లోలిత షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ దురాగతాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన బజ్‌ఫీడ్‌ న్యూస్ జర్నలిస్టు మేఘా రాజగోపాలన్‌ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో అవార్డుకు ఎంపిక అయ్యారు. అక్కడ లక్షల మంది వీగర్ ముస్లింలను నిర్భంధించడానికి భారీగా నిర్మించిన రహస్య కేంద్రాలను శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగించి ఫొటోలను ప్రపంచానికి అందించారు మేఘా రాజగోపాలన్..

భారత సంతతకి చెందిన నీల్ బేడి అనే జర్నలిస్ట్‌కు కూడా లోకల్ రిపోర్టింగ్ కేటగిరిలో పులిట్జర్ ప్రైజ్ దక్కింది. భవిష్యత్‌లో నేరానికి పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి అమెరికాలోని ప్యాస్కో కౌంటీలో స్థానిక భద్రత అధికారులు తెచ్చిన ఒక కంప్యూటర్ మోడలింగ్‌లోని లోపాలను ఎత్తిచూపుతూ రాసిన కథనాలకు క్యాథలీన్ మెక్ గ్రోరీతో కలిసి ఆయన అవార్డును పంచుకోనున్నారు. దాంతో పాటు ఫ్లోరిడాకు చెందిన ఓ అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దీనిపై నీల్ బేడి పరిశోధాత్మక కథనాలు రాశారు. ఈనేపథ్యంలో నీల్ బేడి.. పులిట్జర్ బహుమతికి ఎంపికయ్యారు.

Tags:    

Similar News