Lockdown: లాక్‌డౌన్ తప్పదంటోన్న ఇండియన్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌

Lockdown: క‌రోనా కేసుల‌ను అదుపులోకి తెచ్చేందుకు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టాల‌ని ఐఎంఏ కేంద్రాన్ని కోరింది.

Update: 2021-05-09 01:37 GMT

 Lockdown:(File Image)

Lockdown: దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజు రోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతూ ప్రజల్లో ఆందోళనను తీవ్రంగా పెంచుతోంది. దీనిని కట్టడి చేయాలంటే లాక్ డౌన్ తప్పదని ఇప్పటికే నిపుణులు, మేధావులు చెబుతుండగా.. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆర్ధికంగా నష్టం ఉంటుందనే అంచనా ఉన్నప్పటికీ.. లాక్ డౌన్ పెట్టకపోతే కరోనా కట్టడి కాక.. ఆర్ధిక నష్టం అంతకంటే ఎక్కువే జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

క‌రోనా కేసుల‌ను అదుపులోకి తెచ్చేందుకు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టాల‌ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. వైర‌స్ చైన్‌కు అడ్డుక‌ట్ట వేయ‌డంతో పాటు కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్న మెడికల్‌ సిబ్బందికి కొంతమేర స్వస్థత చేకూరుతుందని అభిప్రాయపడింది. ఇక గ‌తంలోనే తమ అసోసియేషన్‌ నుంచి కేంద్రానికి ఇచ్చిన సలహాలు, సూచనలు పలుమార్లు బుట్టదాఖలు అయ్యాయని మెడిక‌ల్ అసోసియేష‌న్‌ ఆవేదన వ్యక్తంచేసింది. దేశ వ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ అవ‌స‌ర‌మ‌ని కేంద్రాన్ని కోరారు.

రాత్రిపూట క‌ర్ఫ్యూల వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేద‌ని, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కంటే ప్ర‌జ‌ల ప్రాణాలే ముఖ్య‌మ‌ని మెడిక‌ల్ అసోసియేష‌న్ అభిప్రాయ‌ప‌డింది. ఇక వ్యాక్సిన్‌నేష‌న్ ప్ర‌ణాళిక‌నూ కూడా త‌ప్పుబ‌ట్టింది. ప్ర‌జా వైద్యానికి దేశ జీడీపీలో 8 శాతం మేర కేటాయింపులు జ‌ర‌పాల‌ని కేంద్రానికి రాసిన లేఖ‌లో ప్ర‌స్తావించారు. మ‌రి మెడిక‌ల్ అసోషియేష‌న్ ప్ర‌తిపాద‌న‌పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News