రూ. 64,000 కోట్లతో మరో 26 రఫేల్-మెరైన్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Update: 2025-04-09 10:59 GMT

26 Rafale marine fighter jets: రూ. 64,000 కోట్లతో మరో 26 రఫేల్-మెరైన్ జెట్స్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

26 Rafale marine fighter jets purchase order: దేశ భద్రత కోసం కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6.6 బిలియన్ యూరోల విలువైన మరో 26 రఫేల్ - మెరైన్ జెట్స్ కొనుగోలు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. భారతీయ కెరెన్సీలో ఈ అగ్రిమెంట్ విలువ అక్షరాల రూ. 64,000 కోట్లు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక స్థావరంగా ఈ రఫేల్-మెరైన్ జెట్స్ పనిచేయనున్నాయి. సముద్రంలో శత్రు దేశాల కదలికలపై కన్నేసేందుకు, శత్రువుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఈ రఫేల్-మెరైన్ జెట్స్ ఉపయోగించనున్నారు.

ఫ్రాన్స్‌తో జరుపుకోనున్న ఈ ఒప్పందంలో భాగంగా 22 సింగిల్ సీట్ రఫేల్ జెట్స్, మరో 4 రెండు సీట్లు ఉండే ట్రైనర్ జెట్స్ ఉన్నాయి. ఇవేకాకుండా ఆయుధాలు, సిమ్యులేటర్స్, సిబ్బందికి జెట్స్ ఆపరేట్ చేసేందుకు శిక్షణ, ఐదేళ్ల పాటు ఈ రఫేల్ జెట్స్ పర్‌ఫార్మెన్స్, మెయింటెనెన్స్ సపోర్ట్ వంటి అంశాలు ఉంటాయి.

పాత 36 రఫేల్ జెట్స్‌కు అప్‌గ్రేడ్ సపోర్ట్

2016 సెప్టెంబర్‌లో రూ. 59,000 కోట్లతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం కేంద్రం 36 రఫేల్ జెట్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆనాటి రఫేల్ జెట్స్‌కు అవసరమైన అప్‌గ్రేడ్స్, ఎక్విప్‌మెంట్, విడి భాగాల సరఫరా కూడా ఈ కొత్త అగ్రిమెంట్‌లో ఒక భాగం కానుంది.

కొత్త అగ్రిమెంట్ పై భారత్ - ఫ్రాన్స్ ఎప్పుడైతే సంతకాలు చేస్తాయో అప్పటి నుండి 37-65 నెలల మధ్య ఈ 26 రఫేల్ మెరైన్ జెట్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది.  

Tags:    

Similar News