భారత సైన్యం ‘ఆపరేషన్ శివశక్తి’పై కీలక అప్‌డేట్

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో భారత సైన్యం, రాష్ట్ర పోలీసులు, పౌర నిఘా విభాగాల సమన్వయంతో ఈ రోజు ఉదయం నుంచి ‘ఆపరేషన్ శివశక్తి’ ప్రారంభించారు. ఈ స్పెషల్ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను రక్షణ శాఖ అధికారులొకరు మీడియాతో పంచుకున్నారు.

Update: 2025-07-30 13:30 GMT

విశ్వసనీయ సమాచారం మేరకు ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నారన్న నిఘా దృష్ట్యా భద్రతా దళాలు సమన్వయంతో దాడులు నిర్వహించాయి. తెల్లవారుజామున నియంత్రణ రేఖ (LoC) వద్ద భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

తర్వాతి తనిఖీల్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, కమ్యూనికేషన్ పరికరాలు, మందులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రెండు అస్సాల్ట్ రైఫిల్స్, ఒక పిస్టల్, హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు (IEDs) ఉన్నాయి.

సైనికుల వేగవంతమైన, సమన్విత చర్య వల్ల ఒక పెద్ద ఉగ్రదాడిని ముందుగానే అడ్డుకోవడంలో విజయం సాధించారని అధికారులు తెలిపారు. ఇంకా ఆ ప్రాంతంలో ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా అనే అంశంపై స్పష్టతకు గాను పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News