ముంబయిలో రెండో రోజు పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధాని స్టార్మర్
బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన రెండో రోజు ముంబయి పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.
ముంబయిలో రెండో రోజు పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధాని స్టార్మర్
భారత్, బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం ఇరు దేశాలకు అపారమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. భారత్‌లో 125 మంది ప్రతినిధుల బృందంతో ఆయన ముంబయిలో రెండో రోజు పర్యటిస్తున్నారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్న భారత్‌తో బ్రిటన్ ఒప్పందం.. పురోభివృద్ధికి లాంచ్‌పాడ్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐరోపా సమాఖ్య నుంచి తాము వైదొలగిన తర్వాత.. భారత్‌తో కుదిరిన ఒప్పందం చాలా కీలకమైనదన్నారు. దీనివల్ల ఈయూపై బ్రిటన్ ఆధారపడడం తగ్గుతుందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు.