Vaccine Record: కొవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ న్యూ రికార్డు

Vaccine Record: ఒక రోజులో 2 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

Update: 2021-09-18 03:45 GMT

కరోనా వాక్సినేషన్లో భారత్ కొత్త రికార్డు (ఫైల్ ఇమేజ్)

Vaccine Record: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల వరకు కేవలం ఒక రోజులో రెండు కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు ఇచ్చింది. శుక్రవారం సాయంత్రానికి ఒక రోజులో రెండు కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇవ్వడం పూర్తయినందుకు మాండవీయ హర్షం ప్రకటించారు.

ఇదిలావుండగా ప్రధాని మోడీ శనివారం గోవా హెల్త్‌కేర్ వర్కర్లతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. గోవాలో వయోజనుల్లో నూటికి నూరు శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకోవడం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో కొందరు వ్యాక్సిన్ లబ్ధిదారులు కూడా పాల్గొంటారు. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 79 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. అక్టోబరు నాటికి 100 కోట్ల డోసులు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Full View


Tags:    

Similar News