భారతీయుల స్విస్ బ్యాంకు ఖాతాల గురించిన వివరాలు దేశానికి అందించినట్లు స్విట్జర్లాండ్ కి చెందిన ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కు ఒక అధికారి ప్రముఖ వార్తాసంస్థకు వెల్లడించారు. ఏఐఓఐ విధానంలో ఈ వివరాలు అందించినట్లు తెలిపారు. అయితే వివరాలు రహస్యంగా ఉంచాలన్న నిబంధనలు ఉండడంతో వాటిని వెల్లడించలేమని ఎఫ్టీఏ అధికారి పేర్కొన్నారు. మరో తొమ్మిది నెలల్లో 2020 సంబంధించిన మరికొన్ని ఖాతాల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. తొలి విడతగా లభించిన వివరాల్లో ఎక్కువగా వ్యాపారులు, ఎన్నారైలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఖాతాలు ముసివేశారని వారి ఖాతాలు కూడా భారత్ కు అందిస్తామని ఆ అధికారి తెలిపారు. అయితే గత ఎన్నికల్లో మోదీ సర్కార్ స్వీస్ ఖాతాలు గుట్టురట్టుచేస్తామని, నల్లధనం బయటకు తీస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.