Vaccination Record: వ్యాక్సినేషన్‌లో భారత్ ప్రపంచ రికార్డ్

Vaccination Record: ఆగస్టు నెలలో 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్రం వెల్లడి

Update: 2021-09-05 14:30 GMT
కరోనా వాక్సినేషన్ లో భరత్ ప్రపంచ రికార్డు (ఫైల్ ఇమేజ్)

Vaccination Record: వ్యాక్సినేషన్‌లో భారత్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఆగస్టు నెలలో 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆగస్టు నెలలో జీ7 దేశాల్లో వేసిన మొత్తం వ్యాక్సిన్ల కన్నా భారత్‌లో గత నెలలో వేసిన వ్యాక్సిన్లు ఎక్కువని వెల్లడించింది. కెనడా, బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ దేశాలను జీ7 దేశాలుగా పిలుస్తారు. జీ7 దేశాల్లో కెనడా అతి తక్కువగా 30 లక్షలు, జపాన్ ఎక్కువగా 4 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశాయి. భారత్‌లో జూన్ 21న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటివరకూ సుమారు 68 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. డిసెంబర్ నాటికి ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Tags:    

Similar News