చౌకగా పెట్రోల్... దండీగా కొనేద్దాం.. ఇండియా చమురు కంపెనీల దూకుడు

India: అమెరికా ఆంక్షలపై ఇండియా అవసరాలే పైచేయి సాధిస్తున్నాయ్.

Update: 2022-03-18 10:14 GMT

చౌకగా పెట్రోల్... దండీగా కొనేద్దాం.. ఇండియా చమురు కంపెనీల దూకుడు

India: అమెరికా ఆంక్షలపై ఇండియా అవసరాలే పైచేయి సాధిస్తున్నాయ్. దేశీయంగా 80 శాతానికి పైగా చమురు దిగుమతులపై ఆధారపడ్డ ఇండియా ఇప్పుడు చౌకగా లభిస్తున్న రష్యా చమురుపై స్పెషల్‌గా కాన్సనస్ట్రేషన్ చేస్తున్నాయ్. మార్కెట్ ధర కంటే 25 శాతం తక్కువ ధరకే ఇండియాకు చమురు చేర్చుతామంటూ రష్యా ఇస్తున్న ఆఫర్ తో చమురు కంపెనీలు ఖుషీ అవుతున్నాయ్. గత నెల రోజులుగా చమురు ధరల అస్థిరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలు ఇప్పుడు తక్కువ ధరకు లభించే ఆయిల్ కొనాలని ఉవ్విళ్లూరుతున్నాయ్. చౌకగా పెట్రోల్ అమ్మితే దండీగా కొనేద్దామంటూ కంపెనీలు కొత్త ఎగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నాయ్.

గత వారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రష్యా నుంచి 3 మిలియన్ బ్యారెళ్ల చమురు కొనుగోలు చేయగా తాజాగా హిందుస్థాన్ పెట్రోలియం 2 మిలియన్ బ్యారెళ్ల చమురు కొనుగోలు చేసింది. అమెరికా కఠినమైన ఆంక్షలు విధించినా దేశీ అవసరాలపై కంపెనీలు ప్రధానంగా దృష్టిసారిస్తున్నాయ్. వచ్చే రోజుల్లో మరింత ఇంధనాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నాయ్. తక్కువ ధరకు చమురు అందుబాటులోకి వచ్చినప్పుడు కొనుగోలు చేస్తే తప్పేందన్న వర్షన్ విదేశాంగ శాఖతోపాటు, చమురు శాఖ నుంచి వస్తోంది. చమురు ధరల్లో అస్థిరతతో ఇండియా ఎంతగానో నష్టపోతుందని మార్కెట్లో తక్కువ ధరకు చమురు దొరుకుతుంటే ఇండియా కొంటే తప్పేలా అవుతోందన్న వర్షన్ ను నిపుణులు సైతం విన్పిస్తున్నారు.

ఓవైపు రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తున్నా నిబంధనలకు లోబడి వాణిజ్యాన్ని రెండు దేశాలు కొనసాగిస్తున్నాయ్. చమురు చెల్లింపుల కోసం ఇప్పటికే రూపీ-రూబల్ మధ్య డీల్ సైతం కుదిరింది. తాజాగా ఇండియా యూరోపియన్ ఎనర్జీ ట్రేడర్ విటోల్ నుంచి రష్యన్ క్రూడ్‌ కొనుగోలు చేస్తోంది. రష్యాపై యూరప్ దేశాల ఆంక్షలతో పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేసి దేశంలో చమురు ధరల్లో స్థిరత్వాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. తద్వారా దేశీయంగా ఆర్థిక వృద్ధితోపాటు దేశ అభివృద్ధికి మొత్తం వ్యవహారం దన్నుగా నిలుస్తోందని కేంద్రం భావిస్తోంది. 

Tags:    

Similar News