India Afghanistan Relations: భారత్ - అఫ్గానిస్తాన్‌ల స్నేహబంధం.. పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ముత్తఖీ
అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రితో భేటీ వేళ పాకిస్తాన్‌కు భారత్ స్పష్టమైన సందేశాన్ని పంపింది.
India Afghanistan Relations: భారత్ - అఫ్గానిస్తాన్‌ల స్నేహబంధం.. పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ముత్తఖీ
India Afghanistan Relations: అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రితో భేటీ వేళ పాకిస్తాన్‌కు భారత్ స్పష్టమైన సందేశాన్ని పంపింది. భారత్, అఫ్గన్ రెండూ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, వీటిపై సంయుక్త పోరు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
మరోవైపు కాబుల్‌లో పాకిస్తాన్ జరిపిన పేలుళ్లపై తీవ్రంగా స్పందించారు అఫ్గన్ విదేశాంగ మంత్రి ముత్తఖీ.. తమకు సమస్యలు సృష్టించాలని భావిస్తే ఏం జరుగుతుందో సోవియట్ యూనియన్, అమెరికా, నాటోలను అడిగితే చెబుతారని హెచ్చరించారు. అఫ్గనిస్తాన్‌లో మరిన్ని ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ప్రకటించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.