తమిళనాడు వ్యాప్తంగా బస్సు డ్రైవర్ల నిరవధిక సమ్మె
Tamil Nadu: రవాణాశాఖ మంత్రితో కార్మికుల చర్చలు విఫలం
తమిళనాడు వ్యాప్తంగా బస్సు డ్రైవర్ల నిరవధిక సమ్మె
Tamil Nadu: తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. రవాణాశాఖ మంత్రిలో కార్మికుల చర్చలు విఫలం కావడంతో కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. తమిళనాడు వ్యాప్తంగా 22వేల ప్రభుత్వ బస్సు సర్వీసులు నడుపుతున్నారు. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సుల సమ్మెతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. వేతనాల పెంపు, బస్సు డ్రైవర్, కండక్టర్ ఖాళీలను భర్తీ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మెకు కార్మిక సంఘాల యూనియన్లు మద్దతు తెలిపాయి. కాగా బస్సుల సమ్మెపై దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది.