Coronavirus: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: 8 రాష్ట్రాల్లో కలవరపెడుతున్న మహమ్మారి * మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడులో కొత్త కేసులు

Update: 2021-03-07 02:46 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రజలను హడలెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది.. గత కొన్ని వారాలుగా ఎనిమిది రాష్ట్రంల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి చేస్తున్న చర్యలను సమీక్షించారు. దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య భారీగా తగ్గినట్లు గుర్తించామని వెల్లడించారు.

ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, ఛత్తీస్‌గఢ్‌లో కరోనా టెస్టుల సంఖ్య తగ్గడంతో పాటు వీక్లీ పాజిటివిటీ రేటు పెరుగుతోందని కేంద్రం వెల్లడించింది. కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కాంటాక్ట్ ట్రేసింగ్‌ కూడా సరిగా జరగట్లేదని గుర్తించినట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌భూషణ్‌ వెల్లడించారు.

కరోనాను అరికట్టేందుకు రాష్ట్రాలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. గతేడాదిలాగే కరోనా కట్టడికి తీసుకున్న చర్యలను మళ్లీ తిరిగి అమలు చేయ్యాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులు చేసి పాజిటివ్‌ వచ్చిన వారిని ట్రేస్‌ చేయడంతో పాటు వారికి చికిత్స అందించాలన్నారు. వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేయాలని సూచించింది. ఎక్కువ మరణాలు నమోదవుతున్న జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ జరగాలన్నారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాలు, ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. దీని కోసం ప్రైవేటు ఆస్పత్రుల సహకారం తీసుకోవాలన్నారు. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Full View


Tags:    

Similar News